Site icon PRASHNA AYUDHAM

మృత్యువు ఎప్పుడు, ఎక్కడ ఎవరికి, ఎలా రాసిపెట్టి ఉంటుందో ఎవరికి తెలియదు.*

మృత్యువు
Headlines:
  1. శ్రీకాకుళం జిల్లాలో బావిలో పాము రక్షించబోయి మామ, అల్లుళ్లు ప్రాణాలు కోల్పోయారు
  2. శ్రీకాకుళం: పాము కాపాడే క్రమంలో బావిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు
  3. మృత్యు తెప్పించిన క్షణం: పామును రక్షించడంలో బావిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన మధుసూదనరావు
  4. బావిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన మామ, అల్లుళ్ల ఘటనపై గ్రామంలో విషాదం
  5. శ్రీకాకుళం జిల్లాలో హృదయాన్ని వేదించే ఘటన: పామును కాపాడేందుకు బావిలోకి దిగిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం

*కళ్లెదుట ఒక మూగ జీవి మునిగి పోవడం చూసి తట్టుకోలేక కాపాడుదాం అనుకున్న సమయం….పామును రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన మామ, అల్లుళ్లు..!*

మృత్యువు ఎప్పుడు, ఎక్కడ ఎవరికి, ఎలా రాసిపెట్టి ఉంటుందో ఎవరికి తెలియదు.*

*మృత్యు ఘడియలు వచ్చాయంటే చాలు చిన్నా, పెద్ద, డబ్బున్నోడు,డబ్బులేనోడు, కులం,గోత్రం…ఏమి అడ్డురావు ఎటువంటి బంధాన్ని అయిన ఇట్టే తెంపేసి ఎంతటి వారినైనా తీసుకుపోతుంది*

శ్రీకాకుళం జిల్లా

పొందూరు మండలం

కనిమెట్ట గ్రామము

మధుసూదనరావు(55) అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న బావిలో ఒక పాము పడిపోయి తేలుతుంది.

అది గమనించి బావిని కూడా క్లీన్ చేయాలన్న ఉద్దేశ్యంతో బావి వద్ద మోటార్ ను ఏర్పాటు చేసి బావిలోని నీటిని బయటకు తోడిoచేసారు.

అయితే ఈ క్రమంలో తాడు తెగిపోయి మోటారు బావిలో పడిపోయింది. 

బావిలో పడిపోయిన మోటార్‌ను బయటకు తీసేందుకు బావిలో నిచ్చెన వేసి లోపలకు దిగాడు మధుసూదనరావు.

అయితే బావిలోకి వెళ్ళాక లోపల ఆక్సిజన్ లేక ఊపిరి ఆడలేదు.

దాంతో బావిలోనే మధుసూదానరావు కుప్పకూలిపోయాడు.

బయట ఉన్న వారు అది గమనించారు. వెంటనే మధుసూదనరావు ను రక్షించే ఉద్దేశంతో బయట ఉన్న అతని మేనల్లుడు కింతలి వినోద్(20) బావిలోకి దిగాడు.

వినోద్ కి కూడా అతని మేనమామకు ఎదురైనా పరిస్థితే ఎదురైంది.

అతనికి లోపల ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యి బావిలో కుప్పకూలిపోయాడు. వెంటనే బయట నుంచి అదంతా గమనించిన గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు

Exit mobile version