నింగి నేల ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి స్మారక అవార్డు ప్రధానోత్సవం

*నింగి నేల ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి స్మారక అవార్డు ప్రధానోత్సవం*

• తెలంగాణ వేగుచుక్క శ్రీకాంతా చారి : ఎమ్మెల్సీ మధుసూదనాచారి

• 90 మంది ఉద్యమకారులకు అవార్డుల ప్రధానం

• శ్రీకాంతాచారి మాతృమూర్తి శంకరమ్మ కు సన్మానం

తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ప్రాణాన్ని సైతం అగ్నికి ఆహుతి చేసి తెలంగాణ ఉద్యమానికి అగ్గిరాజేసిన తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి అని, అతని త్యాగం వెలకట్టలేనిదని అతని త్యాగ ఫలితమే నేడు మన తెలంగాణ అని శాసనమండలి సభ్యులు మధుసూదనాచారి అన్నారు మల్లారెడ్డి గార్డెన్ లో జరిగిన శ్రీకాంతాచారి మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు, తెలంగాణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించిన విశ్వకర్మ ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి అతడు మా జాతి రత్నం అని కొనియాడారు, ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన నింగి నేల మేము సైతం సభ్యులను ఆయన పేరుపేరునా అభినందించారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ శ్రీకాంత్ చారి పేరున ఏదైనా ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇంత గొప్ప కార్యం హైదరాబాదులోనే కాకుండా దేశ రాజధాని అయిన ఢిల్లీలో జరిగేలా చూస్తానని ఆయన మాట ఇచ్చారు, శ్రీకాంతాచారి మాతృమూర్తి శంకరమ్మ మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకాంతాచారి కి మా కుటుంబానికి చేసింది చాలా తక్కువ అని హైదరాబాదులో ఎల్బీనగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న హాస్పిటల్ కు శ్రీకాంత్ చారి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు, విశ్వకర్మ మను మయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమాచారి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మలది ప్రముఖ పాత్ర అని శ్రీకాంతాచారి మారోజు వీరన్న తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమ ఉస్మానియా యూనివర్సిటీ

ముద్దుబిడ్డ దరువు అంజన్న లాంటివాళ్ళు ఎందరో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపారని అన్నారు, నింగి నేల మేము సైతం సలహాదారులు ఉద్యమ నేత దరువు అంజన్న మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సంవత్సరం శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతులను అధికారికంగా జరపాలని ప్రభుత్వాన్ని కోరారు,

ఈ సందర్భంగా తెలంగాణ నలుమూలల నుండి విచ్చేసిన తెలంగాణ ఉద్యమంలో విరోచితమైన పోరాటపటిమ చూపి జైలు పాలై కేసులు పెట్టుకొని ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదరణకు నోసుకోలేని అసలు సిసలైన ఉద్యమకారులను నింగి నేల మేము సైతం శ్రీకాంతా చారి మెమోరియల్ అవార్డును 90 మంది ఉద్యమకారులకు ఇచ్చి ఘనంగా సత్కరించారు,

ఈ కార్యక్రమంలో రాళ్ల బండి విష్ణు

పుల్లోజు అశోక్ చారి వీరాచారి సంగీత దర్శకులు విష్ణు కిషోర్ సినిమా హీరో రఫీ రోషం బాలు , గుండ్రాతి శారద నింగి నేల మేము సైతం గౌరవ అధ్యక్షులు యాదగిరి ప్రసన్న కుమారస్వామి రోహిణి అనురాధ గౌడ్ శివారెడ్డి ఇందిరా సతీష్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాకారులు పాడిన పాటలు సభను కంటతడి పెట్టించాయి.

Join WhatsApp

Join Now