గర్భిణీ మహిళకు (బి నెగెటివ్) రక్తదానం చేసిన శ్రీకాంత్

గర్భిణీ మహిళకు (బి నెగెటివ్) రక్తదానం చేసిన శ్రీకాంత్

-జిల్లా రక్తధాతల సేవా సమితినిర్వాహకులు

-బోనగిరి శివ కుమార్ , ముదాం  శ్రీధర్ పటేల్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 24:

కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో రక్తహీనత తో చికిత్స పొందుతున్న సుల్తానా అనే గర్భిణీ మహిళకు అత్యవసరంగా అతీ తక్కువ మందిలో ఉండే బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీకాంత్ సహకారంతో వారికి బి నెగిటివ్ రక్తం సకాలంలో అందచేయడం జరిగింది.

ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ

యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని తెలుపడం జరిగింది

ఈ సందర్బంగా ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసిన శ్రీకాంత్ నీ జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పేషంట్ కుటుంబసభ్యులు , కే బి ఎస్ బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now