ఏఐసీసీ నేతలను కలిసిన టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రావు
*గజ్వేల్ , జనవరి 09, (ప్రశ్న ఆయుధం ):*
టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు గురువారం టిపిసిసి కార్యాలయం గాంధీభవన్లో ఏఐసిసి పెద్దలను కలిశారు. ఏఐసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్షిలను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యల పైన చర్చించినట్లు బండారు శ్రీకాంత్ రావు తెలిపారు.