
-రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల
పాల్వంచ దమ్మపేట సెంటర్ లో నూతనంగా ఏర్పాటైన శ్రీకాంతి హాస్పిటల్స్ లో ఆపరేషన్ థియేటర్ ను డీసీఎంస్చై ర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభించారు.
బుధవారం డాక్టర్లు టి రమేష్ కుమార్, బీవీన్చై తన్య ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో రోగులకు కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేసారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ రోగుల పాలిట దేవుళ్ళు అయినా డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ, రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ప్రజల స్థితి గతులను పరిశీలించి, వారికి వైద్యం అందించాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, కందుకూరి రాము, పులి సత్యనారాయణ, మధుతదితరులు పాల్గొన్నారు.