అన్న క్యాంటీన్లకు రూ.1 కోటి విరాళం అందించిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర డెవలపర్స్..

అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ

ఆగస్టు 15న ప్రారంభం కానున్న 100 అన్న క్యాంటీన్లు

 

ఆగస్టు 15న ఏపీలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అన్న క్యాంటీన్ల నిర్వహణ నిమిత్తం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించింది. ఆ మేరకు సీఎం చంద్రబాబుకు సంస్థ ప్రతినిధులు చెక్ అందించారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు.  ఈ నెల 15న అన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. అన్న క్యాంటీన్ల కోసం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించడం అభినందనీయం.ఆ సంస్థ అధినేత విజయవాడకు చెందిన పెనుమత్స శ్రీనివాసరావు నేడు సచివాలయంలో విరాళం అందించారు. అంతేకాదు, రాబోయే ఐదేళ్లపాటు ఇంతే మొత్తంలో విరాళం అందిస్తానని తెలిపారు. ఇది ఎంతో హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా శ్రీనివాసరాజును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పేదవాడికి అన్నం పెట్టే మంచి కార్యక్రమం మళ్లీ ప్రారంభిస్తున్నామని తెలిసి అన్ని వర్గాల వారు అందులో భాగస్వాములు అవుతుండడం ఆనందం కలిగిస్తోంది. తమకు ఉన్న దాంట్లోనే కొంత సమాజం కోసం ఖర్చు చేయాలనే వారి ఆలోచనలు అందరికీ స్ఫూర్తిదాయకం” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now