మెదక్/నార్సింగి, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నార్సింగి మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బక్కన్నగారి శ్రీనివాస్ రెడ్డిని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. గురువారం కొంపల్లి తన నివాసంలో నార్సింగి మండల కిసాన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డికి నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా బక్కన్నగారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, మెదక్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పి. ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాచి, బీసీ సెల్ అధ్యక్షుడు రాజేశ్, ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
*మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి*
Published On: August 29, 2024 8:00 pm
