సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు పనులకు ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీసీ రోడ్డు పూర్తయ్యేలా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగంగా చేపడతామని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చాకలి చంద్రయ్య, తాజా మాజీ ఉప సర్పంచ్ విజయకుమార్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు లింగయ్యగారి హనుమంత్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆగం రాజు, నీరుడి నర్సింలు, గ్రామస్తులు సాలె వెంకటేశం, నీరుడు పోచయ్య, లక్ష్మాపురం రాములు, తోలు ఎల్లయ్య, బద్దు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
Published On: November 15, 2025 6:56 pm