వినాయక మండపాలను సందర్శించిన ముప్పు శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 31
నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నాగారం మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి మండపంలో భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అలాగే, పలు చోట్ల నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందించారు. ఈ సందర్శనలో ఆయనతో పాటు తెలంగాణ జన సమితి పార్టీ నాగారం మున్సిపల్ అధ్యక్షుడు చిట్యాల శ్రీనివాస్ రెడ్డి, మాదిరెడ్డి రాజి రెడ్డి, మామిడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు స్థానికులతో కలిసి వినాయకోత్సవ శోభాయాత్రల ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తుల భక్తి ఉత్సాహం, నిర్వాహకుల సమన్వయం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.