నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ యాదవ్

IMG 20250517 213052
హైదరాబాద్/రాజేంద్రనగర్, మే 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): వ్యవసాయ విశ్వ విద్యాలయంలో 30 సంవత్సరాలుగా ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న తమ ప్యానెల్ సభ్యులను గెలిపించినందుకు నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 16న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 695 మంది ఉద్యోగులు 12 కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ లో ఓటు వేశారు. శనివారం ఓట్ల లెక్కింపులో నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎం.శ్రీనివాస్ యాదవ్, అసోసియేట్ అధ్యక్షుడు ఎం.రాజు, ఉపాధ్యక్షుడు ఎం.దశరథ్, ప్రధాన కార్యదర్శి ఎస్.జయరామ్, సంయుక్త కార్యదర్శి జి.పరమేశ్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.రవీందర్ రెడ్డి, సాంస్కృతిక క్రీడల కార్యదర్శి సంజీవరెడ్డి, సాంకేతిక విభాగం కార్యదర్శి సులోచన, కోశాధికారి ఎస్.కే.నజీర్ లు ఎన్నికయ్యారు. అనంతరం వైస్ ఛాన్స్లర్, రిజిస్టర్ లను కలిశారు. ఎన్నికైన పానెల్ సభ్యులను శాలువాలతో సన్మానించి, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 30 సంవత్సరాలుగా తాను యూనివర్శిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కు ఎక్కువ సార్లు అధ్యక్షుడిగా పని చేశానని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఉద్యోగులకు హెల్త్ సెంటర్ లో వైద్యం అందేలా చర్యలు తీసుకున్నానని అన్నారు. ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్యానల్ కు ఓటు వేసి గెలిపించిన ఉద్యోగులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now