Site icon PRASHNA AYUDHAM

సరస్వతీ విద్యామందిర్ పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించిన శ్రీరంగం ఫౌండేషన్ కో చైర్మన్ ఇందుమతి శ్రీరంగం.”

” సరస్వతీ విద్యామందిర్ పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించిన శ్రీరంగం ఫౌండేషన్ కో చైర్మన్ ఇందుమతి శ్రీరంగం.”

ప్రశ్న ఆయుధం నవంబర్ 21: కూకట్‌పల్లి ప్రతినిధి 

 ” విద్యార్థులని, సమాజాన్ని తీర్చిదిద్దగల మహా శక్తి ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది – శ్రీరంగం ఫౌండేషన్ కో చైర్మన్ ఇందుమతి శ్రీరంగం.”

శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ లోని సరస్వతీ విద్యామందిర్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు మరియు పాఠశాల సిబ్బందికి శ్రీరంగం ఫౌండేషన్ కో చైర్మన్ ఇందుమతి శ్రీరంగం చేతులమీదుగా వస్త్రాలు అందచేశారు. అనంతరం వ్యాసరచన, కవిత్వం, ప్రశ్నావినోదము లాంటి విభిన్నపోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకి బహుమతులు, బిస్కెట్లు, ఫ్రూట్ జ్యూస్ అందచేశారు. ఈ సందర్బంగా ఇందుమతి శ్రీరంగం మాట్లాడుతూ విద్యార్ధి దశలో మన జీవితంలో అతి ముఖ్యమైన వారు తల్లిదండ్రులు, గురువులేనని, విద్యార్థులని, సమాజాన్ని తీర్చిదిద్దగల మహా శక్తి ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని అన్నారు. సరైన విద్యతోనే రేపటి సమాజాన్ని నిర్మించవచ్చునని అన్నారు. సుసంపన్నమైన దేశం కోసం సిద్దమవుతున్ననేటి బాలలే రేపటి జాతి రత్నాలని వాఖ్యానించారు. విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవర్చుకోవాలని అన్నారు. సరైన పద్దతిలో చదువుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. విద్యార్థులు గురువుల పట్ల గౌరవంగా ఉండి, ఎప్పటి పాఠాలను అప్పుడే చదివినప్పుడు మంచి ఫలితాలు వస్తాయన్నారు. అలాగే శ్రీరంగం ఫౌండేషన్ తరపున పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించే విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన భారతి స్వచ్చంధ సంస్థ కమిటీ సభ్యుడు నరేంద్రప్రసాద్, విశ్రాంత ప్రత్యేక మెట్రోపాలిటీ మేజిస్ట్రేట్ ఎం.ఎం.విజయ జ్యోతి, అడ్వకేట్ రజిని, రూప యాచంద్ర, సంధ్య ఆకూరి, కందగట్ల కవిత రెడ్డి, పాఠశాల కమిటీ సభ్యులు నాగభూషణరావు, రాంచంద్రా రెడ్డి మరియు శ్రీరంగం ఫౌండేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version