*శ్రీశైల గిరులు.. పర్యాటక సిరులు..!!*
రుద్రా పార్కు నుంచి నల్లమల కొండల నడుమ శ్రీశైలం జలాశయం అందాలు
కృష్ణమ్మను అందెలుగా పెట్టుకొని.. అభయారణ్యాన్ని కట్టుకొని.. శిఖర సిగన మల్లన్న కోవెలను ధరించిన మనోహర ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైలం.
దీన్ని పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చేయాలని రాష్ట్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. నల్లమల కొండల్లో వయ్యారాలు పోయే కృష్ణా నది సౌందర్యాన్ని బాహ్య ప్రపంచానికి చూపేలా ఇటీవలే సీ ప్లేన్‌నూ ప్రారంభించింది. దీంట్లో విజయవాడ నుంచి వెళ్తే అరగంటలోనే శ్రీశైలం చేరుకోవచ్చు. ఇలాంటి సౌకర్యాలతో రానున్న రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రప్రభుత్వం పర్యాటకంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే స్థానిక రుద్రా పార్కును ఆహ్లాదంగా తీర్చిదిద్దింది. వివిధ బొమ్మలను ఏర్పాటుచేసింది.
శ్రీశైలంలోని రుద్రా పార్కులో ఎడ్ల బండి బొమ్మ వద్ద పర్యాటకులు