*సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా — కూన శ్రీశైలం గౌడ్*
*ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 04:కుత్బుల్లాపూర్ ప్రతినిధి*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గం ప్రజలతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలువురు ఆహ్వానాలను అందజేశారు.
అనంతరం వారి ఆహ్వానాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
ప్రజాపాలనలో మన ప్రభుత్వం దూసుకెళ్తుందాన్నారు..
ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.