బిబిపేట చెరువులో మృతి చెందిన యువకుడి కుటుంబానికి SSC మిత్రుల అండ

బిబిపేట చెరువులో మృతి చెందిన యువకుడి కుటుంబానికి SSC మిత్రుల అండ

బిబిపేట చెరువులో మృతి చెందిన ఎల్లబోయిన సాయి కుటుంబాన్ని ఆదుకున్న SSC 2001–2002 బ్యాచ్ మిత్రులు.

పెద్దమ్మ అభ్యర్థనపై ముందుకు వచ్చిన స్నేహితులు.

50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేత.

చిన్న సహాయం కూడా కష్టాల్లో ఉన్నవారికి పెద్ద బలమని యువతకు సందేశం.

సహాయక కార్యక్రమంలో 20 మందికి పైగా బ్యాచ్ మిత్రులు పాల్గొన్నారు.

ప్రశ్న ఆయుధం,బిబిపేట, సెప్టెంబర్ 3:

బిబిపేట చెరువులో దురదృష్టవశాత్తు మృతి చెందిన ఎల్లబోయిన సాయి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో, బిబిపేట ZPHS (బాయ్స్) SSC 2001–2002 బ్యాచ్ మిత్రులు ముందుకు వచ్చారు. సాయి పెద్దమ్మ ఫోన్ ద్వారా మిత్రుల సహాయం కోరగా, బ్యాచ్ స్నేహితులు వెంటనే స్పందించి 50 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు కుటుంబ సభ్యులకు అందజేశారు.

కష్టకాలంలో చిన్న సహాయం కూడా పెద్ద అండగా మారుతుందని, ఇలాంటి సందర్భాల్లో యువత ముందుకు రావాలని మిత్రులు మీడియా ద్వారా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కపిల్, విశాల్, రాజు, మంగలి స్వామి, దోర్నాల రమేష్, మహమ్మద్ రషీద్, మోత్కూరి శ్రీకాంత్, చందుపట్ల సాయిబాబా, తుడుపునూరి సంతోష్, మద్దూరి సాకలి స్వామి, సాకలి శ్రీనివాస్ (ఇస్సానగర్), బిక్షపతి, జనగామ శ్రీకాంత్ గౌడ్, కుర్ల రాజు, తొడుపునూరి రవి, మెడికల్ నరేష్, మల్కాపూర్ సిరిగద స్వామి, మహమ్మద్ ఆసిఫ్, వడ్నాల రవి తదితరులు పాల్గొని సాయి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment