ఎస్ ఎస్ సి స్కూల్ టాపర్ ఎర్రవార్ భవిత 582

*ఎస్ ఎస్ సి స్కూల్ టాపర్ ఎర్రవార్ భవిత 582*

*భవితను అభినందించి ఘనంగా సన్మానించిన నారాయణ స్కూల్ యాజమాన్యం*

నిర్మల్,ఏప్రిల్ 30.

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో చదువుతున్న ఎర్రవార్ భవిత (తండ్రి ఎర్రవార్ రాజేష్) కు ఎస్ ఎస్ సి లో 582 మార్కులతో స్కూల్ టాపర్గా నిలిచింది. దాంతో స్కూల్ యజమాన్యం భవితకు ఘనంగా సన్మానం చేశారు. భవిత చిన్నతనం నుండే చదువుపై మక్కువతో ప్రతి క్లాసులో టాపర్ గా నిలిచేది, అదే విధంగా ఇప్పుడు కూడా స్కూలుకుటాపర్గా రావడం జరిగింది. ఈ సందర్భంగా భవిత మాట్లాడుతూ తనకు స్కూల్ టాపర్ గా ఇన్ని మార్పులు రావడానికి తను రోజుకు 18 గంటలు కృషి చేశానని దానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం అహర్నిశలు ప్రోత్సహించి తనను అన్ని విధాల ఉత్సాహపరిచి చదివించారన్నారు. తల్లిదండ్రులైన శృతి రాజేష్ వెంట ఉంటూ ప్రతిక్షణం ఉత్సాహ పరుస్తూ ఉత్తేజపరుస్తూ తనకు అన్ని విధాల సాయసాకారం అందచేయడం వలన తను ఈరోజు ఎన్ని మార్కులు రావడానికి కారణభూతులయ్యారని చెప్పింది. అలాగే నానమ్మ ఎర్రవార్ సునీత తాతయ్య కేశవ్ వారి యొక్క దీవెనలు కూడా పనిచేశాయని చెప్పారు. భవితకు ఊరువాడ అందరూ చుట్టాలు స్నేహితులు అభినందన వెలువలతో ముంచేస్తున్నారు.

Join WhatsApp

Join Now