సంగారెడ్డి, అక్టోబర్ 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా ఎస్‌జీఫ్ ఆధ్వర్యంలో ఆదివారం గాడియం స్కూల్‌లో నిర్వహించిన అండర్-14 జిమ్నాష్టిక్స్ స్కూల్ పోటీలలో సేయింట్ ఆంథోన్ హై స్కూల్ (శాంతినగర్) విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జిమ్నాష్టిక్స్ ఆర్టిస్టిక్ విభాగంలో తమ ప్రతిభను చాటుతూ జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారు. విద్యార్థులు యం.విగ్నేష్, యం.రాహుల్, యన్.వరుణ్ నాయక్, జి.అశ్విని కుమార్, సి హెచ్. జశ్వంత్, స్టీపాన్ లు ఎంపికయ్యారు. వీరి విజయంపై సేయింట్ ఆంథోన్ విద్యా సంస్థల అధిపతి సొలొమోన్ రెడ్డి, డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ అరుణ రెడ్డి, జిమ్నాష్టిక్స్ కోచ్ విఠల్, వ్యాయామ ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సేయింట్ ఆంథోన్ విద్యార్థులు
Oplus_16908288