ఎస్టీ బాయ్స్ హాస్టల్లో దారుణం..
విద్యార్థిని కొట్టి, బలవంతంగా నలుగురు వ్యక్తులు పురుగుల మందు తాగించినట్లు ఆరోపణ .. విద్యార్థి మృతి.ఆదిలాబాద్ జిల్లా పిట్టలవాడలోని ఎస్టీ బాయ్స్ పోస్టుమెట్రిక్ హాస్టల్లో ఉంటూ బీఎస్సీ చదువుతున్న రాథోడ్ జితేందర్(20) అనే విద్యార్థిని శుక్రవారం రాత్రి హాస్టల్ బయట నలుగురు వచ్చి అతడిని కొట్టి పురుగుల మందు తాగించారని తోటి విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు.స్పృహ తప్పి పడిపోయిన అతడు కొంతసేపటికి లేచి నగేష్ అనే తన బందువుకు ఫోన్ చేసి చెప్పగా ఆయన వచ్చి తోటి విద్యార్థులతో కలిసి జితేందర్ ను రిమ్స్ కి తరలించారు.పరిస్థితి విషమించటంతో అతడిని ఆదిలాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.. ఇటీవల తీజ్ వేడుకలో అతడికి చోర్గాంలో కొందరితో వివాదం నెలకొందని, వాళ్లే ఇలా చేశారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు