ఎస్టీ విద్యార్థుల హస్టల్…అధ్వానం

ఎస్టీ
Headlines
  1. గజ్వేల్ ఎస్టీ హాస్టల్ సమస్యలు: డిబిఎఫ్ డిమాండ్
  2. పెచ్చులూడిన స్లాబ్‌లు, చినిగిన దోమతెరలతో విద్యార్థుల దైన్యం
  3. ఎస్టీ హాస్టల్ పరిసరాల్లో విష సర్పాలు, కుక్కల బెడద
  4. విద్యార్థుల హక్కుల కోసం డిబిఎఫ్ ఆందోళన
  5. హాస్టల్ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్

పెచ్చులూడిన స్లాబ్… పర్రెలు పడ్డ గోడలు

చినిగిన దోమతెరలు…పలిగిన బాత్ రూం డోర్లు

నెలలు గడుస్తున్న తినే ప్లేట్లు,త్రాగే గ్లాసులు లేని పరిస్థితి

డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

గజ్వేల్ నవంబర్ 24 ప్రశ్న ఆయుధం :

ఎస్టీ విద్యార్థుల హాస్టల్ సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్య,వివక్ష వైఖరి విడనాడాలని ఆదివారం రోజున గజ్వేల్ ఎస్టీ హాస్టల్ కు వెళ్ళిన సందర్బంగా డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎస్టీ హాస్టల్ స్లాబ్ పెచ్చులూడం తో ఎప్పుడు వర్షం వచ్చిన పెచ్చులు మీదపడుతాయోనని వనుకుతూ నిద్రపొవాల్సిన పరిస్థితి,దోమ తెరలు లేక కిటికీలోంచి విష పురుగులు వచ్చి మలేరియా,డేంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాదులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. గత ఆరేడు సంవత్సరాలుగా విద్యార్థుల తరగతులు మారుతున్న ట్రంకు పెట్టలు మాత్రం మారక విరిగిన పెట్టలతో సర్దుకుంటున్న విద్యార్థులు,ప్రహరి గోడలేక పందులు,కుక్కలు,విష సర్పాలు , స్పైరా విహారం చేస్తున్న పరిస్తుందన్నారు.

విరిగిన బాత్ రూం డోర్లతో విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు రాష్ట్రంలో వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలైన విద్యార్థిని 25 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి,నల్లగొండ జిల్లాలో పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్సపొందున్న తీరు, నారయణపేట్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 50 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైన వైనం కనిపిస్తున్న ఈ ఎస్టీ హాస్టల్ సమస్య పరిష్కరించడంలో నిర్లక్ష్యం ఎందుకో అర్థంకాని పరిస్థితి. ఈ సమస్యలపై గతంలో స్థానికి తహశీల్దార్ కు ప్రజావాణిలో కాలెక్టర్ కార్యలయంలో పిర్యాదుచేసిన పరిష్కారం కాక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేంటనే అధికార యంత్రాంగం స్పందించి హస్టల్ సమస్యలను పరిష్కారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment