మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. స్థానిక దేవాలయం వద్ద ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఈ శిక్షణ నిర్వహించబడుతుంది. యోగ గురువులు భగవతి రమావత్ మోహన్ ఈ తరగతులకు నేతృత్వం వహిస్తున్నారు.
యోగా శిక్షకులు మాట్లాడుతూ, “యోగా అనేది శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది. ఈ ఉచిత తరగతుల ద్వారా గ్రామస్థులు ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోవడానికి మేము సహాయం చేస్తున్నాము” అని తెలిపారు.