గండివేట్‌లో ఎమ్మెల్యే మదన్ మోహన్ చేత హైమాక్స్ లైట్ల ప్రారంభం –
ఇందిరమ్మ ఇల్లు పరిశీలన
గాంధారి మండలం గండివేట్‌లో కొత్త హైమాక్స్ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
జానీ కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు స్వయంగా పరిశీలన
“అర్హులందరికీ ఇల్లు – మా లక్ష్యం” అని ఎమ్మెల్యే భరోసా
లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా బిల్లులు జమ అవుతున్నాయని స్పష్టం
మరిన్ని ఇళ్లు మంజూరై పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ
గాంధారి, ఆగస్టు 10 (ప్రశ్న ఆయుధం):
గాంధారి మండలం గండివేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్లను శనివారం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఘనంగా ప్రారంభించారు. అనంతరం అదే గ్రామంలో జానీ కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జానీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ – “మాకు ఇల్లు మంజూరు చేసి సొంత ఇంటి కలను నెరవేర్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కి, సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు” తెలిపారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ – “నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. బిల్లులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. అర్హులందరికీ ఇల్లు మంజూరు చేయడం మా లక్ష్యం. గ్రామ పంచాయతీ సెక్రటరీలతో మీటింగ్‌లు నిర్వహించి పనుల పురోగతిపై నివేదికలు తీసుకుంటున్నాను” అన్నారు.అలాగే – “ఇందిరమ్మ ఇళ్లతో పేద ప్రజల సొంతింటి కల సాకారం అవుతుంది. మరిన్ని ఇళ్లు మంజూరయ్యేలా ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తాను” అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గాంధారి AMC చైర్మన్ బండారి పరమేష్, వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, సొసైటీ డైరెక్టర్ తడువాయి సంతోష్ కుమార్, సితాయపల్లి శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గండివేట్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.