*నేటి నుండి సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభం*
*జమ్మికుంట ఫిబ్రవరి 20 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో నేటి (శుక్రవారం) నుండి సిసిఐ పత్తి కొనుగోలు ప్రారంభం అవుతుందని రైతులు పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అమ్ముకోవాలని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఆర్ మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రోజున ఆధార్ సర్వర్ పునరుద్దరణ కావడం వలన సీసీఐ(భారతీయ పత్తి సంస్థ) వారు 21.02.2025 శుక్రవారం నుండి పత్తి కొనుగోళ్లను ప్రారంభం అవుతుందని ఇట్టి విషయమును రైతు సోదరులు గమనించి పత్తిని సీసీఐ కొనుగోళ్ళ కేంద్రాలకు (జిన్నింగ్ మిల్లులకు) పత్తిని తీసుకవచ్చి అమ్ముకోవాలని సూచించారు. వచ్చే ముందు రైతులు వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్,పట్టాదార్ పాస్ బుక్ జిరాక్స్ ఆధార్ తో అనుసంధానం అయిన బ్యాంక్ పాస్ బుక్ కు లింక్ చేసుకోగలరని తెలిపారు. ఇట్టి సమాచారాన్ని రైతు సోదరులు గమనించగలరని మార్కెట్ కార్యదర్శి కోరారు