రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా జన్మదిన వేడుకలు
Katyada Bapurao
*రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా జన్మదిన వేడుకలు*
*శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు*
*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్*
*ఇల్లందకుంట మే 8 ప్రశ్న ఆయుధం*
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం పెద్ది కుమార్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం ఇల్లందకుంట మండల కేంద్రంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పొన్నం ప్రభాకర్ కళాశాల కన్వీనర్ నుంచి ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్ష పదవి వరకు బాధ్యతలు చేపట్టి విద్యార్థి లోకానికి సేవలు అందించారని, అలాగే కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు పొన్నం ప్రభాకర్ ని ఉమ్మడి కరీంనగర్ ఏం పీ గా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అందించిన ఘనత పొన్నం ప్రభాకర్ దని, హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట రైల్వే స్టేషన్ ను ఆదర్శ స్టేషన్ గా అభివృద్ధి చేసిన ఘనత పొన్నం ప్రభాకర్ ది అని పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించి, పెప్పర్ స్ప్రే కు గురై ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సిద్ధించడంలో ప్రముఖ పాత్ర పోషించారని రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన నాయకుడు పొన్నం ప్రభాకర్ ని పేర్కొన్నారు ప్రస్తుత తరుణంలో తెలంగాణ లో ప్రజా ప్రభుత్వంలో మంత్రిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్న నాయకుడు పొన్నం అని కొనియాడారు ఇల్లందకుంట మండల ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, బుర్ర రమేష్, కనుమల్ల రామకృష్ణ, కనుమల్ల సంపత్,మీస రాజయ్య, గూడెపు ఓదెలు, చిరంజీవి, గోలి కిరణ్, పరమేశ్వర్, బొమ్మ శ్రీనివాస్, గుండారం సాయికుమార్, బండి మల్లయ్య, మిట్ట మోహన్ రావు, బైరెడ్డి కొండల్ రెడ్డి, మూడేళ్ల రమేష్, గురుకుల స్వామి భోగం సాయికుమార్, మారపల్లి వేణు, ఎండి గాపూర్, పైడిపల్లి దేవేందర్, మోత్కూరి శ్రీనివాస్, మనసాని రవి తదితరులు పాల్గొన్నారు.
To provide the best experiences, we use technologies like cookies to store and/or access device information. Consenting to these technologies will allow us to process data such as browsing behavior or unique IDs on this site. Not consenting or withdrawing consent, may adversely affect certain features and functions.