- ఆలయాల వద్ద రాజకీయాలు మానుకోండి
ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డికి
రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సూచన
వాస్తవానికి రథోత్సవనికి భక్తులు అధికంగా రావడం,కొంత మంది భక్తులు రథోత్సవాన్ని చూడాలనే తొందరలో వాహనాలను రోడ్డుకి ఇరువైపులా నిలపడం ద్వారా, మరో ముగ్గురు వ్రాంగ్ రూట్లో రావడం ద్వారా రద్దీకి కారణమైంది. రథోస్తవ సమయంలో పోలీసులు ఎక్కువ మంది పైకి వెళ్లడం వల్ల కింద ఈ సమస్య సంబవించడని భావిస్తున్నాం,కానీ కాంగ్రెస్ నాయకులను పంపి ప్రశాంత్ రెడ్డిని మాత్రమే అపరు అని భగవంతుని దగ్గర వుంది మాట్లాడటం తగదు.వాస్తవానికి టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్,నేను,ముత్యాల సునీల్ మేము కూడా దాదాపు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళమని ప్రశాంత్ రెడ్డి తెల్సుకుంటే బాగుంటుంది. దేవుని కోసం మనం వెళ్ళాలి కానీ మన కోసం దేవుడు ఆగదని ప్రశాంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని,కానీ ప్రశాంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో పస లేదు. బహుశా అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన మొదటి జాతర కావున ప్రశాంత్ రెడ్డికి దర్పం లేకపోవడంతో ఇబ్బంది పడ్డరేమో.భవిష్యత్తులో కూడా మీకు ఇదే ఇబ్బంది వుంటుంది రాబోయే 4సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుంది కావున మీకు ఈ సమస్య తప్పదు.ఆలయాల వద్ద రాజకీయాలు మాట్లాడు ప్రశాంత్ రెడ్డి తన విలువలు తగ్గించుకోవద్దని,భవిష్యత్తులో అయిన ఆలయాల వద్ద వాస్తవాలు మాట్లాడాలని సూచిస్తున్నము.
కృతజ్ఞతలతో
మానాల మోహన్ రెడ్డి
అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ నిజామాబాద్
రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్