Site icon PRASHNA AYUDHAM

ముగింపు సభలకు హాజీరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మంత్రులు

IMG 20250111 WA0020

ముగింపు సభలకు హాజీరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మంత్రులు

ప్రశ్న ఆయుధం జనవరి 11,కామారెడ్డి

లో స్వీయ సాధికారిత,రాజకీయ శిక్షణ తరగతులో 7 రోజులపాటు ఘనంగా నిర్వహించుకుని , శనివారం ముగింపు కార్యక్రమనికి ముఖ్య అతిథిలు గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి లు హాజరయ్యారు. జాతీయ ఆదివాసి శిక్షణ తరగతులు నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ జాతీయ కోఆర్డినేటర్ కొప్పుల రాజు, తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ భేల్లయ్య నాయక్ ల సమక్షంలో ఈ కార్యక్రమం ఏడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించరు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాజకీయ శిక్షణ తరగతుల వల్ల అనేక అంశాలును నేర్చుకోవడం జరిగిందని , దీనివలన రేపు అట్టడుగు స్థాయి వర్గాలకు కూడా రాజ్యాంగం చేరే విధంగా, సమానత్వం కల్పించాలని చెప్పేసి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పైన మరింత పోరాటం పటిమను అలవర్చుకొని వారి సమస్యల పైన పరిష్కారం అయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి వారు పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ ప్రకారంగా గిరిజనుల కు సరైన పద్ధతిలో ప్రతిఫలాలు అందడం లేదని దాని అమలు చేసే దిశగా ప్రతి ఒక్కరూ సంకల్పంతో ఉండాలని వారు సూచించినారు. ఈ కార్యక్రమంలో గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి, కామారెడ్డి జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్, కామారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నునావత్ గణేష్ నాయక్, నాయక్ పోడు రాష్ట్ర అధ్యక్షులు గంజి రాజు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సదర్ నాయక్, సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ హైదరాబాద్, మైత్రి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version