కామారెడ్డి జిల్లాలోని పలు రెస్టారెంట్లలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక దాడులు..
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు మరియు డైరెక్టర్ ఐపిఎం డాక్టర్ సి శివలీల ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ P. రోహిత్ రెడ్డి , S. శ్రీషిక ,పి.స్వాతి,N. జగన్నాథ్ లతో కూడిన బృందం సదాశివ నగర్ మండలంలోని పోసానిపేట గ్రామంలో గల వైష్ణవి ఫ్లోర్ మిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేయగా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో శనగ పిండిని, రాగి మరియు జొన్నపిండి ప్రాసెస్ చేయడం, కిటికీలకు మెష్ లేకపోవడం తయారు చేసినటువంటి పిండి బస్తాల పై ఈగలు ఉండటం,గోడలు మరియు పై కప్పు పై బూజుతో కూడిన దుమ్ము ధూళీలు ఉండడం,పెస్ట్ కంట్రోల్ పాటించకపోవడం, తగిన రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడంతో నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే సుమారు 28 లక్షల ఐదువేల రూపాయల విలువ కలిగిన 42,500 కిలోల లేబుల్ మరియు ఇతర ప్యాకింగ్ వివరాలు లేకుండా అనుమానాస్పదంగా ఉన్న శనగపప్పును సీజ్ చేయడం జరిగింది, మరియు అనుమానిత శాంపిల్స్ సేకరించి పరీక్ష నిమిత్తం హైదరాబాద్లో గల ల్యాబ్ కి పంపడం జరిగింది మరియు FS ఎస్ ఎస్ ఏ చట్టం 2006 ఉల్లంఘించినందుకు గాను వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం నోటీసులు జారీ చేయడం జరిగింది.అదేవిధంగా కామారెడ్డి మండలంలో గల ఎన్ హెచ్ 44 మరియు ఎన్ హెచ్ 7 రోడ్డుపై గల పర్ణిక ప్యాలెస్ మరియు వైష్ణవి ఇంటర్నేషనల్ హోటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేయగా
వెజ్ అండ్ నాన్ వెజ్, ఉడికినవి మరియు పచ్చివి అన్నీ ఒకే రిఫ్రిజిరేటర్లలో కలిపి ఉంచడం, అపరిశుభ్రంగా ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్లలో నిలువ చేసిన దుర్వాసనతో కూడిన మాంసపు ఉత్పత్తులను భారీ మొత్తంలో గుర్తించడం, అలాగే మరియు ఎగ్జాస్టర్ ఫాన్స్ పై నూనెతో కూడినటువంటి నూనె మరియు దుమ్ము ధూళితో పేరుకుపోవడం, ఫుడ్ హ్యాండ్లర్స్ హెయిర్ క్యాప్ మరియు హ్యాండ్ గ్లోవ్స్ ధరించకపోవడమ్,అపరిశుభ్ర ప్రాంతంలో మూతలు తీసిన దుమ్ము ధూళి ఈగలతో కూడిన వండిన ఆహార పదార్థాలను మరియు అధికంగా పలుమార్లు వేడి చేసిన వంట నూనెను ఆహార పదార్థాలలో వాడుతుండడం గుర్తించడం జరిగింది. పర్ణిక ప్యాలెస్ హోటల్ లో గల స్టోర్ రూమ్ నందు సుమారు 45 వేల రూపాయల నిల్వ ఉంచిన మాంసం, కాలం చెల్లిన ముడి సరుకులు, EXPIRED అయినటువంటి తేనె, ఫ్రూట్ పుల్ప్ మరియు పురుగులతో కూడినటువంటి బియ్యం,మిల్ మేకర్, ధనియా పొడి, మరియు ఇతర పదార్థాలను ప్రజల ఆరోగ్య నిమిత్తం హోటల్ యాజమాన్యాన్ని ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ హెడ్ వి.జ్యోతిర్మయి హెచ్చరించి అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగింది, మరియు ఎఫ్ఎస్ఎస్ 2006 చట్టం ఉల్లంఘించినందుకుగాను వారికి నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా,NH 7 రోడ్ లో గల వైష్ణవి ఇంటర్నేషనల్ బార్ అండ్ రెస్టారెంట్ హోటల్లో సుమారు 17వేల రూపాయల విలువగల 40 కిలోల నిల్వ ఉంచిన దుర్వాసనతో కూడినటువంటి మాంసము, 10 కిలోల గోధుమపిండి మరియు పది కిలోల ప్రాన్స్ ను, ప్రజల ఆరోగ్యం నిమిత్తం అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగింది మరియు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది.నిబంధనలు పాటించని, ప్రభుత్వ అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే సీజ్ చేస్తామని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి.జ్యోతిర్మయి తేల్చిచెప్పారు. వ్యాపారులు నిబంధనలు పాటిస్తూ బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ అయిన వి. జ్యోతిర్మయి మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు సూచించడం జరిగింది,అలాగే ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.