రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు..

IMG 20241003 WA0058

రేషన్, ఆరోగ్య కార్డుల స్థానంలో సంక్షేమ పథకాలు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు ఇవ్వనుంది. ఇందులో భాగంగా ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయనున్నారు. ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలో రెండు గ్రామాలు, రెండు మున్సిపల్‌ వార్డులను ఎంపిక చేశారు. జిల్లాలో 21 మండలాలు, నాలుగు పురపాలికలున్నాయి. వీటిలో 2.14 లక్షల కుటుంబాలున్నాయి. ప్రస్తుతం రేషన్‌ కార్డులు, ఆరోగ్య శ్రీ పథకానికి కార్డులు ఉన్నాయి. రేషన్‌ కార్డు లేని వారు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్నింటికి ఒకే కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు డిజిటల్‌ ఫ్యామిలీ కార్డు ఇవ్వనున్నారు.

రెండేసి చొప్పున ఎంపిక.

డిజిటల్‌ ఫ్యామిలీ కార్డు సర్వే జిల్లాలో గురువారం ప్రారంభమై ఈనెల7వ తేదీ వరకు సాగనుంది. జిల్లాలో చిన్నశంకరంపేట మండలం కామారం , నర్సాపూర్‌ మండలం గొల్లపల్లి మెదక్‌ పట్టణంలో 20 వ వార్డు, నర్సాపూర్‌లో 8వ వార్డులో సర్వే నిర్వహించనున్నారు. ఒక్కో బృందంలో నలుగురు అధికారులు చొప్పున 11 బృందాలను ఏర్పాటు చేశారు. సర్వే సందర్భంగా ఆయా కుటుంబాల్లో పుట్టిన, మరణించిన వారి వివరాలు తీసుకొని నమోదు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులకు శిక్షణ ఇచ్చారు. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా పక్కా ప్రణాళికతో సర్వే చేపట్టనున్నామని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు చెప్పారు. 11 బృందాలను ఏర్పాటు చేశామని, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.

Join WhatsApp

Join Now