కామారెడ్డిలో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ అవగాహన సదస్సు

కామారెడ్డిలో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ అవగాహన సదస్సు

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్‌ చార్ట్‌ తప్పనిసరి!

సిటిజన్‌ చార్ట్‌లో సేవలు, అధికారులు, సమయపట్టిక స్పష్టంగా ఉండాలి – చీఫ్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి

ఆర్టీఐ చట్టం అమలులో నిర్లక్ష్యం వహిస్తే 25 వేల రూపాయల ఫైన్‌

కామారెడ్డి — ఆర్టీఐ దరఖాస్తులు తక్కువగా వచ్చిన మూడు జిల్లాల్లో ఒకటి

ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందేలా చర్యలు

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 220 ఆర్టీఐ అప్పీల్స్‌పై ప్రత్యేక హియరింగ్

కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం రాష్ట్ర సమాచార కమిషన్‌ ఆధ్వర్యంలో పిఐఓ, ఏపీఐఓలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ – ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్‌ చార్ట్‌ను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. అందులో సేవలు, బాధ్యత వహించే అధికారులు, అందించే గడువు తేది వంటి వివరాలు ఉండాలని ఆదేశించారు.

ఆర్టీఐ దరఖాస్తులు నిర్ణీత 30 రోజుల్లో ఖచ్చితంగా, పారదర్శకంగా ఇవ్వాలని, తిరస్కరిస్తే కారణం తప్పనిసరిగా తెలపాలని చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే గరిష్టంగా ₹25 వేల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించారు.

కామారెడ్డి కొత్త జిల్లా కాబట్టి ప్రజల్లో ఆర్టీఐ చట్టంపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 220 కేసులను ప్రత్యేక హియరింగ్ ద్వారా పరిష్కరించనున్నట్టు తెలిపారు.

కలెక్టర్‌ ఆశీష్‌ సాంగ్వాన్‌ మాట్లాడుతూ — అధికారులు చట్టం మార్గదర్శకాల ప్రకారం స్పందించి పారదర్శకంగా సమాచారం అందించాలని కోరారు. కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, మోహ్సినా పర్వీన్, దేశల భూపాల్‌ కూడా ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్‌ చంద్ర, అధికారులు విక్టర్‌, చందర్‌నాయక్‌, కిరణ్మయి, చైతన్యరెడ్డి, పిఐఓలు, ఏపీఐఓలుతదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now