గజ్వెల్ ముగిసిన రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలు

గజ్వెల్ ముగిసిన రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలు.

బాయ్స్ జట్టులో మొదటి బహుమతి రంగారెడ్డి జిల్లా జట్టు కైవాసం

గర్ల్స్ జట్టులో మొదటి బహుమతి నిజామాబాద్ జిల్లా జట్టు కైవసం..

గజ్వెల్ 02 మర్చి 2025 :

గజ్వెల్ పట్టణంలోని ఐఓసీ ప్రాంగణంలో గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి బేస్బాల్ స్టేట్ ఐదవ సబ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో భాగంగా గెలుపొందినటువంటి క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర బేస్బాల్ జనరల్ సెక్రెటరీ శ్వేతా మేడం మరియు ట్రెజరర్ కృష్ణ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమాలలో బహుమతులు గెలుపొందిన వారు బాయ్స్ విభాగంలో మొదటి బహుమతి రంగారెడ్డి జిల్లా జట్టు ద్వితీయ బహుమతి మహబూబాబాద్ జట్టు తృతీయ స్థానాన్ని నిజామాబాద్ జట్టు కైవసం చేసుకోగా బాలికల విభాగంలో మొదటి స్థానాన్ని నిజామాబాద్ జట్టు ద్వితీయ స్థానాన్ని నల్గొండ జట్టు తృతీయ స్థానాన్ని మేడ్చల్ జట్టు కైవసం చేసుకున్నాయి. ఈ బేస్బాల్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బేస్బాల్ సెక్రటరీ మధు యాదవ్, సిద్దిపేట జిల్లా బెస్బల్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, ఆర్గనైజ్ సెక్రెటరీ ప్రవీణ్ గౌడ్,డాక్టర్ స్వామి, విశ్వశాంతి పాఠశాల చైర్మన్ దయాకర్ రావు, వివిధ జిల్లాలో సెక్రెటరీ కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now