ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

రాష్ట్రస్థాయి
Headlines :
  • రాష్ట్రస్థాయి అండర్ 17 బాల బాలికల టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
  • జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు
  • క్రీడాకారులు విజయం సాధించడానికి కాంక్ష అవసరం

జిల్లా కలెక్టర్ జితేస్ వి పటేల్ ముఖ్యఅతిథి

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

భద్రాద్రి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న అండర్ 17 బాల బాలికల రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆనందఖని ఆవరణలో ప్రారంభమైన ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని మాట్లాడుతూ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తాము పరిస్థితుల నుంచి ఎక్కడి నుంచి వచ్చాము అని కాకుండా,గెలవాలనే కాంక్ష ఎక్కువగా ఉండాలని అప్పుడే విజయం సాధించగలరని అన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో సైతం పాల్గొనడం వల్ల జీవితంలో చక్కగా స్థిరపడవచ్చు అని పేర్కొన్నారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి తన వంతుగా కృషి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
టీం ఛాంపియన్షిప్ లో కాంస్య పతకం సాధించిన ఆతిద్య జట్టు
68వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్ 17 బాల బాలికల టేబుల్ టెన్నిస్ పోటీలు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆనందఖని ఆవరణలో ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. టీం, ఛాంపియన్షిప్,వ్యక్తిగత అంశాల్లో ఈ పోటీలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర జట్టును ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపనున్నారు. ఈ పోటీలలో టీం ఛాంపియన్షిప్ విభాగంలో ఆతిద్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బాలికల జట్టు తృతీయ స్థానం సాధించింది బాలుర జట్టు సైతం అద్భుతమైన ప్రతిభ కనబరిచి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. ఆదివారం సాయంత్రం నుంచి వ్యక్తిగత పోటీలను నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వరా చారి కార్యదర్శి నరేష్ కుమార్తో పాటు ఈ పోటీల రాష్ట్ర పరిశీలకులు మామిడి సంతోష్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు బట్టు ప్రేమ్ కుమార్, యనమదల వేణుగోపాల్, లక్ష్మయ్య,శేఖర్, స్టెల్లా, రాము, కవిత, సీతాదేవి, సుజాత,నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now