నేడే రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళనం..!

సమ్మేళనం
Headlines :
  1. నేడు రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళనం భక్త రామదాసు కళాక్షేత్రంలో
  2. వేలాదిమంది గిరిజనుల సాంస్కృతిక ప్రదర్శన ర్యాలీ
  3. వివిధ వామపక్ష పార్టీలు, ప్రజా ప్రతినిధులు సమ్మేళనంలో హాజరు

*వేలాదిమంది గిరిజనులతో సాంస్కృతి సంప్రదాయాలతో ప్రదర్శన…*

*హాజరవుతున్న వివిధ వామపక్ష పార్టీల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన, ఉద్యోగ సంఘాల నేతలు…*

*భక్త రామదాసు కళాక్షేత్రాన్ని పరిశీలించిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు….*

*ఖమ్మం:-

తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గిరిజన సమ్మేళనం నేడు భక్త రామదాసు కళాక్షేత్రంలో జరుగుతుందని, సమ్మేళనం జరుగు స్థలాన్ని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ శ్రీరాం నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం , భూక్యా శ్రీనివాస్ నాయక్,సేవాలాల్ సేన రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్, గిరిజన సంఘం నగర నాయకులు డుంగ్రోత్ శంకర్ నాయక్,బోడ మోహన్ నాయక్,దారవత్ ప్రభాకర్ నాయక్ లు పరిశీలించారు, ఉదయం 10 గంటలకు ఏలియన్ గ్రౌండ్ నుండి గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో భారీ ప్రదర్శన ర్యాలీ ఉంటుందని వారు తెలిపారు. 11 గంటలకు భక్త రామదాసు కళాక్షేత్రంలో సమ్మేళనం జరుగుతుందని ఈ సమ్మేళనంలో గిరిజన, ఉద్యోగ సంఘాలు, గిరిజన ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు మేధావులు పాల్గొంటారని వారు తెలిపారు. సమ్మేళనం జయప్రదం కోసం అందరూ కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now