సంగారెడ్డి ప్రతినిధి, జూలై 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి దగ్గరలోని కంది తునికిళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పుల్కల్ మండలానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంగారెడ్డి వద్ద 161 వ జాతీయ రహదారిపై ఆందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ మండలం గంగోజుపేటకు చెందిన సందీప్, నవీన్, గోoగులూరు గ్రామానికి చెందిన అభిషేక్ లు కంది అక్షయపాత్రలో పని చేస్తున్న ముగ్గురు యువకులు బైక్ పై డ్యూటీకి వెళుతున్న క్రమంలో సంగారెడ్డి సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం బాధాకరమన్నారు. మృతి చెందిన యువకులకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని ఆస్పత్రి సూపరిoడెంట్ ను ఆదేశించారు. మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి దామోదర్ రాజనర్సింహా తెలియజేశారు. ప్రభుత్వ పరంగా వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహా
Oplus_0