ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వారిని తెలంగాణ రెవెన్యూ ,గృహ నిర్మాణం, సమాచార శాఖల రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి మంత్రికి వరిపట్టం పెట్టి స్వామి వారి యొక్క క్షేత్ర విశిష్టతను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి పొంగులేటి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రామాలయంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ తాయారు అమ్మ వారి కోవెలలో మంత్రి పొంగులేటికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐఏఎస్, ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు , అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ, భద్రాచలం రామాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనిలో భాగంగా ఇప్పటికేరూ,,70 వే కోట్ల రూపాయలను రామాలయం మాడవీదుల అభివృద్ధి కొరకు విడుదల చేయడం జరిగిందని ఈ మాడవీధుల అభివృద్ధికి సుమారు రెండు ఎకరాలకు పైగా భూమి కావాలని ఇప్పటికే అధికారులు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ప్రజల వద్ద నుండి ప్రజలకు వ్యాల్యూ చేసి భూమిని గుర్తించడం జరిగిందని త్వరలోనే రామాలయం అభివృద్ధి జరగడం ఖాయమని ఆయన అన్నారు. అనంతరం ఆలయ అధికారులతో కలిసి రామాలయ మాడవీధుల అభివృద్ధి పనుల వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులం ఉన్నామని ముగ్గురం కలిసి భద్రాచలం రామాలయం అభివృద్ధిలో ముందుంటామని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి తుమ్మల కూడా రామాలయం అభివృద్ధికి వెనకడుగు వేయరని పేర్కొన్నారు. భద్రాచలం రామాలయం మీద ప్రేమ ఉంది కనుక భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగిందని మరొకసారి ఆయన గుర్తు చేశారు.
సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి
by Naddi Sai
Published On: November 23, 2024 8:31 pm