నిజామాబాద్, 2026-08-05
నిజామాబాద్ నగర సమగ్రాభివృద్ధికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కీలక ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రుల పరిశీలనకు పంపారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నగరాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఇటీవల రాష్ట్రంలోని వివిధ శాఖల మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు.
నిజామాబాద్ నగర సమగ్రాభివృద్ధికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కీలక ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రుల పరిశీలనకు పంపారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నగరాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఇటీవల రాష్ట్రంలోని వివిధ శాఖల మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా నియోజకవర్గ అభివృద్ధికి తగిన నిధులు విడుదల చేయలేదని, ప్రజాప్రతినిధులకు నిధులు కేటాయించకుండా వ్యవహరించడం విచారకరమని ఆయన అన్నారు.
రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి నగర ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం రూ.100 కోట్ల అంచనాతో నాందేవాడ, దేవి రోడ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అదనపు రైల్వే ఓవర్బ్రిడ్జిల నిర్మాణాన్ని ప్రతిపాదించినట్లు ఎమ్మెల్యే ధన్పాల్ వెల్లడించారు. అలాగే ఎల్లమ్మగుట్ట వద్ద రూ.70 కోట్లతో రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేశామన్నారు. వర్నినిజామాబాద్డిచ్పల్లిఇందల్వాయిభీమ్గల్కమ్మర్పల్లి మీదుగా 107 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనను కూడా సమర్పించినట్లు తెలిపారు. రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి వరకు రహదారి అభివృద్ధి అవసరాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి, నిజామాబాద్ టీ-హబ్ ద్వారా ప్రముఖ బహుళజాతి సంస్థలను తీసుకురావాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక యువతకు ప్రతిభ ఉన్నప్పటికీ ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోందని, ఉద్యోగ అవకాశాలను నిజామాబాద్‌కే తీసుకురావడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
వైద్య సదుపాయాల మెరుగుదల
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆస్పత్రిలో ఎంఆర్ఐ యంత్రం లేకపోవడం, మార్చురీ ఫ్రీజర్ల కొరత, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు అవసరం, సివిల్ సర్జన్, ఆర్‌ఎంఓలు, క్యాజువాలిటీ వైద్యాధికారుల ఖాళీల భర్తీ వంటి అంశాలపై వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. పేదలకు సేవలందించే ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కొరత ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.












