ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో జర్నలిస్టులకు ఆరోగ్య హెల్త్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) మరియు హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టులు (HUJ) రాష్ట్ర ముఖ్య కార్యదర్శి K. రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించాయి.
జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, వారికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు హెల్త్ కార్డులు జారీ చేయాలని TWJF, HUJ ప్రతినిధులు కోరారు. సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్టులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని వారు ఈ సందర్భంగా వివరించారు.
ఈ వినతిపత్రం సమర్పణ కార్యక్రమంలో TWJF యాక్టింగ్ ప్రెసిడెంట్ పి. రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు బి. రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శులు బి. జగదీశ్వర్, గండ్ర నవీన్, బి. దామోదర్ పాల్గొన్నారు. HUJ అధ్యక్షుడు బి. అరుణ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు క్రాంతి తదితరులు కూడా హాజరయ్యారు.
జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈ అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రక్రియను ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు.

