బాపట్ల జిల్లాలో ఇంధన కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు.
జిల్లాలో ఇంధన సరఫరా సజావుగా కొనసాగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, తద్వారా కొరత ఏర్పడే అవకాశాలను నివారించవచ్చని ఆయన సూచించారు.
ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇంధన సరఫరా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.
ఇంధన సరఫరాకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమాచారం అవసరమైతే, జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 9493247765 ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
ప్రజలు అధికారులకు సహకరించి, ఇంధన సరఫరా వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.











