సంగారెడ్డి, జూలై 20
ఎల్-నినో ప్రభావం వల్ల వ్యవసాయం, తాగునీరు, పశుసంవర్ధక రంగాలపై ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
ఎల్-నినో ప్రభావం తీవ్రతను తగ్గించేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సోమవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మెదక్ మరియు సంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎల్-నినో ప్రభావం వల్ల వ్యవసాయం, తాగునీరు, పశుసంవర్ధక రంగాలపై ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రత్యామ్నాయ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి ఎ. వాణి ప్రసాద్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవ రెడ్డి, మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, వివిధ మున్సిపాలిటీల ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.












