కొత్తగూడెం రీజియన్ స్థాయిలో ఈపీ ఆపరేటర్ల ఏ గ్రేడ్ పదోన్నతుల ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. మణుగూరు ఏరియా ఈపీ ఆపరేటర్ల ఆధ్వర్యంలో ఈ విజ్ఞప్తి చేశారు.
మణుగూరు ఏరియా డీజీఎం పర్సనల్ సలగల రమేష్ గారికి శనివారం సాయంత్రం ఉద్యోగులు ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈపీ ఆపరేటర్స్ నాయకులు ఎస్.డి. నాసర్ పాషా మాట్లాడుతూ, కొత్తగూడెం రీజియన్ పరిధిలోని మణుగూరు, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు ఏరియాలలో బి గ్రేడ్ లో మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసిన అర్హులైన ఆపరేటర్లకు ఏ గ్రేడ్ పదోన్నతులు కల్పించాలని కోరారు.
గత సంవత్సరం సెప్టెంబర్ నాటికి అర్హత సాధించిన వారికి పదోన్నతులు అందించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఆపరేటర్లకు పదోన్నతులు కల్పించేందుకు ఏరియా యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు మొహమ్మద్ హాజీమియా, వనజర్ల సాయిబాబా, మహబూబ్ జానీ, ఎండి తాజ్, భూక్య అంజయ్య, భానోత్ హాథిరామ్ తదితరులు పాల్గొన్నారు.











