సంగారెడ్డి, July 29
గుండ్ల మాచునూర్ గ్రామ సర్పంచ్ శ్రీహరి బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు.
రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని గుండ్ల మాచునూర్ గ్రామ సర్పంచ్ శ్రీహరి బుధవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వినతి పత్రాన్ని సమర్పించారు.
గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు, పెండింగ్ అభివృద్ధి పనులు, మినీ స్టేడియం నిర్మాణం కోసం సహకరించాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ శ్రీహరి తెలిపారు.






