ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఐదేళ్లుగా సేవలు అందించిన ఇద్దరు కానిస్టేబుళ్లకు ఘనంగా వీడ్కోలు పలికారు. బదిలీపై వెళ్తున్న వారిని ఎస్సై గణేష్, సిబ్బంది సత్కరించారు.
ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో సుమారు ఐదేళ్ల పాటు విశిష్ట సేవలు అందించిన కానిస్టేబుళ్లు కుమార్, దేవేందర్ లు బదిలీ కావడంతో వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్సై గణేష్, సహచర సిబ్బంది వారి సేవలను కొనియాడుతూ, కొత్త ప్రదేశాలలో కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
రైటర్ గా పనిచేసిన కుమార్ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు, కోర్టు పి.సి. గా పనిచేసిన దేవేందర్ తంగళ్ళపల్లి స్టేషన్ కు బదిలీ అయ్యారు. వీరిద్దరూ తమ ఐదేళ్ల సేవలను ఎంతో క్రమశిక్షణతో, నిబద్ధతతో పూర్తి చేశారని అధికారులు తెలిపారు.
బదిలీపై వెళ్తున్న కానిస్టేబుళ్లు కొత్త విధి స్థలాల్లో కూడా ఇదే ఉత్సాహంతో పని చేస్తూ మరెన్నో విజయాలు సాధించాలని, వారి భవిష్యత్తు ప్రయాణం సుఖమయంగా ఉండాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక వీడుకోలు తెలియజేశారు.
పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. కానిస్టేబుళ్ల సేవలను స్మరించుకుంటూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

