నిజామాబాద్, 2026-07-26
నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ త్రిపాఠి తన అధికారిక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పురోగతిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు.

ప్రభుత్వం, ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగానికి అవసరమైన దిశానిర్దేశం చేస్తూ విధుల పట్ల అంకితభావాన్ని చాటుకున్నారు. అనంతరం ఈ నెల 23న హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
కలెక్టర్ త్రిపాఠికి జిల్లా అధికారులు, సిబ్బంది హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.