పటాన్చెరు మండలం పోచారం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఎంఆర్ఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
సుమారు 42 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.
సర్వే నెంబర్ 62తో పాటు, పోచారం గ్రామం, రామేశ్వరబండ, ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 453 మధ్య ఉన్న పౌనదిని సమగ్రంగా సర్వే చేయాలని నాయకులు కోరారు. ఈ ఆక్రమణల వల్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
తక్షణమే హద్దులు గుర్తించి, రక్షణ చర్యలు చేపట్టాలని, చట్టవిరుద్ధంగా ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.











