కామారెడ్డి, 2026-07-01
కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో 35–36 సంవత్సరాల పాటు అంకితభావంతో విశిష్ట సేవలందించిన నలుగురు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు శాఖకు వారు అందించిన సేవలను ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

పోలీసు వృత్తిలో క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో విధులు నిర్వహించిన అధికారులు శాఖకు ఆదర్శంగా నిలిచారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం వారు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఎస్పీ రాజేష్ చంద్ర ఆకాంక్షించారు. అనంతరం శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొని వారికి ఘనంగా వీడ్కోలు పలికారు.