సంగారెడ్డి, జూలై 27
సంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ప్రజావాణిలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా ఆలకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
జిల్లా ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్నారు.
అనంతరం సంబంధిత ఎస్హెచ్ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ స్థానిక పోలీస్ స్టేషన్లలో తమ సమస్యలకు పరిష్కారం లభించని పక్షంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా న్యాయం అందించడమే సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని అదనపు ఎస్పీ తెలియజేశారు.











