కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు తీపికబురు అందించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, ప్రతి రేషన్ కార్డుదారు కుటుంబానికి మూడు నెలల బియ్యం ఒకేసారి అందనుంది. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 18 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు.
ప్రస్తుతం FCI గోదాములలో బియ్యం నిల్వలు అధికంగా ఉండటం, కొత్త ధాన్యం నిల్వకు స్థలం లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పంపిణీ ద్వారా నిల్వలను తగ్గించి, లబ్ధిదారులకు సరుకులు అందించాలని యోచిస్తున్నారు.
గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం తరలించే ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఈ పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.











