సంగారెడ్డి, జూలై 26
ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందడానికి ఈ ప్రక్రియ కీలకమని ఆయన ఆదివారం పేర్కొన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా పూర్తిస్థాయిలో పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందేందుకు ఈ ప్రక్రియ ఎంతో కీలకమని తెలిపారు.
అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ ఫారాలను నింపి, అవసరమైన పత్రాలతో నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఆయన కోరారు. బీఎల్వోలు ప్రజలకు పూర్తి సహకారం అందించాలని, గ్రామస్తులు కూడా అధికారులతో సమన్వయం చేసుకుని కార్యక్రమం విజయవంతానికి తోడ్పడాలని సూచించారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.












