Site icon PRASHNA AYUDHAM

మారపల్లి మొగిలయ్యను బీఎస్పీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు

IMG 20250323 WA0175

*మారపల్లి మొగిలయ్యను బీఎస్పీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు*

*జమ్మికుంట మార్చి 23 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు పట్టణానికి చెందిన మారపల్లి మొగిలయ్య కు బహుజన సమాజ్ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ గా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ పదవి బాధ్యతలు అప్పగించినట్లు మొగిలయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఇందుకు సహకరించిన సెంట్రల్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిశాని రామ చంద్రానికి మారపల్లి మొగిలయ్య కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉపాధ్యాయునిగా పదవి విరమణ పొందినప్పటినుండి పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతూ గడిచిన ఎన్నికలలో ఎమ్మెల్యే గా ఎంపి అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిన నాపై నమ్మకం తో కీలక బాధ్యతలు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని, ఎల్లప్పుడూ పార్టీకి వెన్నంటి ఉంటానని నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని ముందుండి నడిపిస్తానని మారపల్లి మొగిలయ్య తెలిపారు.

Exit mobile version