లగచర్ల లో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పర్యటన
సిద్దిపేట నవంబర్ 23 ప్రశ్న ఆయుధం :
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల కు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందం పర్యటించనుంది. కలెక్టర్ పై దాడి పేరుతో తమ పై పోలీసులు దాడులు చేసి అక్రమంగా అరెస్టులు చేశారని లగచర్ల బాధితులు ఇటివల రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు పిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన చైర్మన్ కలెక్టర్, ఎస్పీ లకు నోటిస్ లు జారి చేశారు. సోమవారం కమిషన్ లగచర్ల లో పర్యటించి దళిత,గిరిజనుల భూముల బలవంతం గా సేకరణ, పోలీసుల వేధింపుల ను బాధితులను కలిసి తెలుసుకొనున్నది.అనంతరం సంగారెడ్డి జిల్లా జైలు కు వెళ్ళి బాధితులను కలవనున్నారు.