Site icon PRASHNA AYUDHAM

పాత పెన్షన్ సాధనకై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం

IMG 20250829 WA00411

పాత పెన్షన్ సాధనకై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం

మేడ్చల్‌ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 29

రాష్ట్రంలోని గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత వేగవంతం చేయనున్నారు. ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పిలుపు మేరకు సెప్టెంబర్ 1, 2025న మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో **”పింఛను ద్రోహ దినం”**ను ఉదయం 11:00 గంటలకు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జేఏసీ ఛైర్మన్ బి. రవి ప్రకాశ్, సెక్రటరీ జనరల్ జి. వినోద్ ప్రకటించారు.

అదే రోజున మధ్యాహ్నం 3:00 గంటలకు హైదరాబాద్‌లోని భాగ్‌లింగంపల్లి వి.ఎస్.టి రోడ్డులోని ఆర్టీసీ కళాభవన్ (కళ్యాణ మండపం)లో **”పాత పెన్షన్ సాధన పోరాట సభ”**ను కూడా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్ రెడ్డి కి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ (టీ.ఈ.జేఏసీ) ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు టీ.ఈ.జేఏసీ పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ సమావేశంలో టీ.ఈ.జేఏసీ ఛైర్మన్ & టీఎన్జీఓ అధ్యక్షుడు రవి ప్రకాశ్, టీ.ఈ.జేఏసీ ప్రధాన కార్యదర్శి & టీజీవో అధ్యక్షుడు జి. వినోద్‌తో పాటు టీజీవో కార్యదర్శి కురుమూతి, ట్రెసా అధ్యక్షుడు సుధాకర్, టీజీవో ప్రచార కార్యదర్శి రవీందర్, టీఎన్జీఓఎస్ జిల్లా కార్యదర్శి బి. భరత్ కుమార్, టీఎన్జీఓఎస్ కోశాధికారి శేష సాయి గిరికాంత్, ఉపాధ్యక్షులు రవిచంద్రన్, అశ్విని, కలెక్టర్ కార్యాలయ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు కార్తీక్/కిశోర్, కోశాధికారి లింగాల అక్షయ్, మేడ్చల్ యూనిట్ అధ్యక్షుడు శ్రీనివాస్, మల్కాజ్‌గిరి యూనిట్ కార్యదర్శి అరుణ, కోశాధికారి సత్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

వీరంతా ఉద్యమ విజయంకై సంఘీభావం వ్యక్తం చేశారు.

Exit mobile version