“రెండు రోజుల్లో చెల్లింపులు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన” – సర్పంచుల ఫోరం

సర్పంచుల బిల్లులపై ఘాటైన హెచ్చరిక

“రెండు రోజుల్లో చెల్లింపులు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన” – సర్పంచుల ఫోరం

పెండింగ్ బిల్లులపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అత్యవసర సమావేశం

డా. సంగం రెడ్డి: “ముఖ్యమంత్రి … 420 మాస్టర్‌గా నిలబడొద్దు”

“సర్పంచుల ఆత్మహత్య రాష్ట్రానికి అరిష్టం” – హెచ్చరిక గళం

బిల్లులు ఇవ్వకపోతే రాజకీయంగా భూస్థాపితం చేస్తామని సవాల్

గ్రామస్థాయిలో సీఎం రేవంత్‌ను అడ్డుకుంటామంటూ యాదయ్య గౌడ్ ధ్వజమెత్తారు

హైదరాబాద్,..తెలంగాణ మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. సంగం రెడ్డి పృథ్వీరాజ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు.“ఈరోజు అసెంబ్లీ ముందే ఒక సర్పంచ్ ఆత్మహత్యను ఆపగలిగాం. గ్రామస్థాయిలో సర్పంచుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అయ్యా ముఖ్యమంత్రి… బిల్లులు ఇవ్వకుండా బ్లఫ్ 420, మాస్టర్‌గా పేరు తెచ్చుకోవద్దు. గ్రామాభివృద్ధి పనులకుగాను పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయండి. ఇకనైనా చర్యలు తీసుకోకపోతే, రాష్ట్రంలో సర్పంచ్ ఆత్మహత్యలు జరిగితే పూర్తి బాధ్యత మీదే. ఒక్క శవానికి మీ ఫోటో గట్టి దేశమంతా తిప్పుతాం. రెండు రోజుల్లో బిల్లులు విడుదల చేయకపోతే మా తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం. రాజకీయంగా మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. తస్మాత్ జాగ్రత్త,” అని ఆయన హెచ్చరించారు.సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ – “గత ప్రభుత్వంనుంచి ఇప్పటి ప్రభుత్వం వరకు కలవని ఎమ్మెల్యే లేరు, కలవని మంత్రి లేరు, మొక్కని దేవుడు లేరు, తొక్కని కడప లేదు. అధికారులను కలవడం, దరఖాస్తులు ఇవ్వడం అన్నీ వృథా అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … మీరు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా స్థానిక ఎన్నికలకు వస్తే, గ్రామాల్లో ఒక్క అడుగు కూడా వేయలేరని మా సర్పంచుల తరఫున చెబుతున్నాం” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.ఈ సమావేశంలో జేఏసీ ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, దుర్గం స్వప్న నరేష్, నరసింహ, కేశ బోయిన మల్లయ్య, చీపురి మల్లయ్య, రవీందర్‌రావు, రాష్ట్ర బీసీ ఆజాద్ సంగ్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, హేమలత, సురేష్, పద్మా రెడ్డి, ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment