వ్యవసాయ కార్మికుల జీవన భృతి కోసం రాష్ట్రవ్యాపిత ఉద్యమం
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
ఏఐపికేఎంఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.రామకృష్ణ
100 రోజుల్లో 6 గ్యారంటీ ల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హమీ వ్యవసాయ కార్మికుల జీవన భృతి కోసం రాష్ట్రవ్యాపిత ఉద్యమం చేపట్టామని అన్నీ మండలాల్లో, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకోవాలి అని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకే ఎమ్ ఎస్) రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి . రామకృష్ణ పేర్కొన్నారు.
శనివారం రోజు అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన పిలుపు లో భాగంగా వ్యవసాయ కార్మికుల సదస్సు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రం లో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు: దేశంలో వ్యవసాయ కార్మికులు 60 లక్షల మందికి పైగా ఉన్నారు అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికుల సంక్షేమన్ని గాలికి వదిలి పెట్టాయని ఆయన విమర్శించారు.
వ్యవసాయ కార్మికులకు ఉపాధి కరువయ్యిందని, వ్యవసాయ కార్మికులు అన్న గుర్తింపు కూడా లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో పనిలేక కాలేకడుపు చేతవట్టుకొని వలస వెళ్తున్న దుస్థితి నెలకొన్నది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈనెల 28 న మోర్తాడ్ తహసీల్దార్ కార్యాలయం ముందు దర్న కు కూలీలు పెద్ద ఎత్తునా పాల్గొనాలని పిలుపునిచ్చారు
సదస్సు లో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి జీ కిషన్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లానాయకులు సారసురేష్, జిల్లా ఉపాధ్యక్షలు సత్తెక్క నాయకులు పోశెట్టి, నాని సాయక్క, రమణి తదితరులు పాల్గొన్నారు.